Uncategorized
Srisailam : శ్రీశైలంకు వరద బంద్.. మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు, సాగర్ లో నీటిమట్టం ఎంతంటే..!
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో వరద నీరు తగ్గింది. దాంతో శ్రీశైలం జలాశయానికి వరద పూర్తిగా బంద్ అయింది.

Srisailam : శ్రీశైలంకు వరద బంద్.. మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు, సాగర్ లో నీటిమట్టం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో వరద నీరు తగ్గింది. దాంతో శ్రీశైలం జలాశయానికి వరద పూర్తిగా బంద్ అయింది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం గేట్లు మూసుకుపోయాయి. దాంతో శ్రీశైలం జలాశయంలో మీరు రాక ఆగిపోయింది. శ్రీశైలం జలాశ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 810 టీఎంసీలకు గాను ప్రస్తుతం 176.331 టీఎంసీల నీరు ఉంది కాగా శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 72,640 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 158. టీఎంసీల విలువ ఉన్నది









