TS News : సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు కొండ దంపతులు దూరం.. సభలో వారికి షాక్ ఇచ్చిన రేవంత్..!
హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు.

TS News : సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు కొండ దంపతులు దూరం.. సభలో వారికి షాక్ ఇచ్చిన రేవంత్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ కు దూరంగా ఉన్నారు.
అంతేకాకుండా పరకాల నియోజకవర్గం నుంచి కొండ దంపతులు వారి కూతురు సుస్మితను రాబోయే ఎన్నికల్లో బరిలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయినా పరకాల నియోజకవర్గంలో సీఎం టూర్ కు వారు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి టూర్ కు దూరంగా ఉన్న కొండా దంపతులకు ఆయన వేదిక పై నుంచే బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ఎమ్మెల్యేలను గెలిపించాలని ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి మరోసారి పోటీ చేస్తారని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో కొండ దంపతులకు ఆశలకు గండి పడ్డట్లు అయింది. రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.









