Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!
నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 530 అడుగులకు చేరింది.

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 530 అడుగులకు చేరింది. సాగర్ జలాశయానికి ప్రస్తుతం 37,527 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో నాగార్జునసాగర్ లో జల విద్యుత్ కు 6,400 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ లో రివర్సబుల్ పంపింగ్ ద్వారా 5,800 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి పంపుతున్నారు.









