Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. లారీ ఢీ కొని వ్యక్తి మృతి..!
రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. లారీ ఢీ కొని వ్యక్తి మృతి..!
సూర్యాపేట, మనసాక్షి :
రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి జనగాం వైపు వెళ్తున్న లారీ, జనగాం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న మోటారైకిల్ను రామన్నగూడెం స్టేజి సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిని చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఆయన మోటార్ సైకిల్ పై గ్రామాల్లో తిరుగుతూ మంచాలకు ప్లాస్టిక్ నవారా అల్లే పని చేస్తుంటాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- Nalgonda : నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసింది విద్యార్థులేనా..?
- భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం!
- District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 20 మంది లైసెన్సులు రద్దు..!
- రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి పాటిస్తే ఎన్నో రోగాలకు చెక్!
- రోజూ క్రమం తప్పకుండా నడకతో ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె పదిలం, ఒత్తిడి దూరం!









