Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..!
నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంకటరమణ బైక్ షోరూం లో మంటలు చెలరేగాయి.

Nalgonda : నల్గొండలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంకటరమణ బైక్ షోరూం లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకులు, స్పేర్ పార్ట్స్ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటన స్థలాన్ని టూటౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ సైదాబాబు పరిశీలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.









