Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ లో అట్టహాసంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు..!

జహీరాబాద్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

జహీరాబాద్ లో అట్టహాసంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు..!

జహీరాబాద్, మనసాక్షి :

జహీరాబాద్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పద్మశాలి భవన్ ప్రాంగణంలో పద్మశాలీయుల వ్యాఘ్ర పతాకాన్ని ఆ సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ ఎగురవేశారు.

సంఘం కార్యవర్గ సభ్యులు, కులబాందవులు పద్మశాలీయుల గీతాన్ని ఆలపించారు. పిమ్మట మందిరం ప్రాంగణంలో వేద మంత్ర ఉచ్చారణల మధ్య హోమం నిర్వహించి యజ్ఞఉపవీత ధారణ జరిపించారు. ఈ క్రమంలోనే పద్మశాలి యువజన సంఘం బైక్ ర్యాలీ నిర్వహించింది. సాయంత్రం 4 గంటలకు మార్కండేశ్వర ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు.

స్థానిక మార్కండేశ్వర మందిరం నుండి ప్రారంభమైన పల్లకి శోభాయాత్ర స్థానిక హనుమాన్ మందిరం, నాగులకట్ట మీదుగా పాండురంగస్వామి మందిరం,గడి వీధిలోని వెంకటేశ్వర మందిరాలకు చేరుకొని తిరిగి మార్కండేశ్వర మందిరానికి చేరుకుంది. శోభాయాత్ర భక్తిపూర్వకంగా సాగింది. పద్మశాళీయుల ఐక్యత, సమ్మిళిత కృషి మూలంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.

MOST READ 

మరిన్ని వార్తలు