ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..!
పటాన్చెరు నియోజక వర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని మాధవపురి హిల్స్, పిజెఆర్ ఎంక్లేవ్ కాలనీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం విగ్రహ ప్రతిష్టాపన, చక్రపురి కాలనీలో శ్రీ ముద్గల ఈశ్వర ఆలయంలో శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..!
పటాన్చెరు, (మనసాక్షి):
పటాన్చెరు నియోజక వర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని మాధవపురి హిల్స్, పిజెఆర్ ఎంక్లేవ్ కాలనీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం విగ్రహ ప్రతిష్టాపన, చక్రపురి కాలనీలో శ్రీ ముద్గల ఈశ్వర ఆలయంలో శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, ప్రశాంతత, సత్సంకల్పాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, గోపాల్, కృష్ణ, మహాదేవ రెడ్డి, బిజిలి రాజు, రాములు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.









