Mahabubnagar : ఓటర్ నమోదుకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచనలు..!
మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ హరిప్రియ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఈఆర్ఓ ) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Mahabubnagar : ఓటర్ నమోదుకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచనలు..!
మహబూబ్ నగర్, మనసాక్షి :
మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ హరిప్రియ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఈఆర్ఓ ) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తహసీల్దార్/ ఏ ఈ ఆర్ ఓ, అదనపు తహసీల్దార్, జడ్చర్ల మండలం మరియు మున్సిపాలిటీ కమిషనర్, మరియు ఎన్నికల డిటి 75–జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం హాజరయ్యారు.
సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఆర్ఓ ఫారం–6, ఫారం–7 మరియు ఫారం–8 ద్వారా దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.అర్హత కలిగిన వ్యక్తులు కొత్త ఓటరు నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఇప్పటికే ఉన్న ఓటర్లు తమ వివరాల్లో సవరణలు చేయించుకునేందుకు సంబంధిత నిర్దేశిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.
ఈ సమాచారాన్ని అర్హత కలిగిన పౌరులకు చేరవేసి, అవసరమైన దరఖాస్తులను నిర్దేశిత విధానంలో సమర్పించేలా సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను ఏఈ ఓ తెలియజేశారు.