Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్రాజకీయం

కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మహిళల కన్నీరు భూమిని తాగితే సునామీగా మారుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మహబూబ్ నగర్ జిల్లా మన సాక్షి :

మహిళల కన్నీరు భూమిని తాగితే సునామీగా మారుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై ఆయన పై విధంగా స్పందించారు. తాను మహిళలను ఎంతో గౌరవిస్తానని, మహిళలకు సంబంధించిన అంశాలపై ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం తన విధానం కాదని స్పష్టం చేశారు.

మహిళల కన్నీరు భూమిని తాకితే సునామీగా మారుతుందన్నారు. నేను ఆడవారిని గౌరవిస్తాననీ, ఇంట్లో మా తల్లి గానీ, ఇతర మహిళలు గానీ నన్ను ఎన్ని తిట్టినా వారి విషయంలో నేను స్పందించి మాట్లాడను అని అన్నారు. కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తనను ఎవరూ పిలవలేదని తెలిపారు.ఎవరూ ఫోన్ చేసి ప్రెస్‌మీట్ పెట్టమని చెప్పలేదని, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు స్పందించి ప్రెస్‌మీట్ నిర్వహించారని చెప్పారు.

ఫైళ్ల క్లియరెన్స్ కోసమే ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. “మా ముఖ్యమంత్రి అంతకు దిగజారలేదు అన్నారు. ఇక జడ్చర్ల నియోజకవర్గంలో పెండింగ్ బిల్లుల అంశంపై పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రకటించారు. నన్ను గెలిపించిన జడ్చర్ల ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పెండింగ్ బిల్లుల కోసం కొట్లాడతానని, బిల్లులు ఇవ్వకపోతే దీక్షకు దిగుతానన్నారు.

మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన అనుభవమంత నా వయస్సు కూడా లేదన్నారు. ఆయన విషయంలో నేను ఏమీ మాట్లాడలేను అని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు.

మహిళల గౌరవం, కొండా సురేఖ అంశం, పెండింగ్ బిల్లులు, పార్టీ సీనియర్లపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గత రెండు రోజుల క్రితం కొండ సురేఖ పై ఎవరు కూడా మాట్లాడవద్దని మీడియా ప్రకటన తెలిపారు గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కొండ సురేఖ పై సంచలన వాక్యాలు మాట్లాడారు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది.

MOST READ 

మరిన్ని వార్తలు