Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

ఏపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..!

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఏపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీలో ఈ ఘటన జరిగింది. కాలనీకి చెందిన మల్ల వినోద్ కుమార్ అనే వ్యక్తి అతడి భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

వినోద్ కుమార్ తన భార్య ఇద్దరు కుమార్తెలకు ముందుగా విషం ఇచ్చి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ 

మరిన్ని వార్తలు