Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు.. భక్తుల్లో ఆందోళన..!

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం సిరిసిల్లకు చెందిన సంతోష్ దంపతులు లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు.

వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు.. భక్తుల్లో ఆందోళన..!

కరీంనగర్, మనసాక్షి :

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం సిరిసిల్లకు చెందిన సంతోష్ దంపతులు లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు లడ్డూ ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో పురుగు కనిపించినట్లు వారు తెలిపారు. దీంతో భక్తుడు సంతోష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో పురుగు కనిపించడం బాధాకరమని పేర్కొన్నారు.

లడ్డూ కవర్‌పై ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని సంతోష్ తెలిపారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి, ప్రసాదాల తయారీ, ప్యాకింగ్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదాల తయారీ కేంద్రంలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

By Naresh, Karimnagar,

 95028 35727

మరిన్ని వార్తలు