Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

శక్తి స్కీమ్ రద్దుకై పోస్ట్‌కార్డుల ఉద్యమం.. సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసిన విద్యార్థులు

శక్తి స్కీమ్ (G.O. నం.97) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) నాయకులు విద్యార్థులతో కలిసి పోస్ట్ చేశారు.

శక్తి స్కీమ్ రద్దుకై పోస్ట్‌కార్డుల ఉద్యమం.. సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసిన విద్యార్థులు

సూర్యాపేట, మనసాక్షి :

శక్తి స్కీమ్ (G.O. నం.97) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) నాయకులు విద్యార్థులతో కలిసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి నాయకులు బంటు సందీప్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న శక్తి స్కీమ్ (G.O. నం.97)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా పోస్ట్ ఆఫీస్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించమన్నారు.

ALSO READజగిత్యాల జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. నెల రోజుల పాటు జిల్లాలో అది అమలులో ఉంటుంది..!

పెద్ద సంఖ్యలో విద్యార్థులతో కలిసి తమ సమస్యలను పోస్ట్‌కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశామన్నారు.
శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్య, భవిష్యత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్‌కార్డులు పంపించి శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ALSO READ : Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

విద్యార్థుల అభిప్రాయాలను పట్టించు కోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థుల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు ఖమ్మంపాటి ఉదయ్ ,పడిదల నవనీత్, బొల్లం వినయ్, ఎలాగబోయిన వంశీ, సాయి, చమకూరి మహేందర్, వెంకట్, అభి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు