ఎరువుల పంపిణికి మరో కొత్త యాప్.. రేపటి నుంచి అమలులోకి.. ఇలా చేస్తేనే రైతుకు ఎరువులు..!
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల పంపిణీకి అమలవుతున్న డిజిటల్ విధానం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 2, 2026 నుండి నల్గొండ జిల్లావ్యాప్తంగా అమలు చేయబడుతుందని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖధికారి కె. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

ఎరువుల పంపిణికి మరో కొత్త యాప్.. రేపటి నుంచి అమలులోకి.. ఇలా చేస్తేనే రైతుకు ఎరువులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల పంపిణీకి అమలవుతున్న డిజిటల్ విధానం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 2, 2026 నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అమలు చేయబడుతుందని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖధికారి కె. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
మండలంలో మెట్ట పంటలు పరిశీలించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ
నల్గొండ జిల్లాలోని రైతులందరూ ఈ నెల సెప్టెంబర్ 2, .2026 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ సేవలను వినియోగించుకొని అన్ని రకాల ఎరువులను యాప్ ద్వార మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్నారు.
ALSO READ : BRS : మిర్యాలగూడలో కేటీఆర్ రైతు ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ..!
ఈ యాప్ ద్వారా యూరియా, డిఎపి, ఎంఓపి, ఎస్ఎస్పి, ఎన్‌పికె కాంప్లెక్స్ ఎరువులను బుక్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
పట్టాదార్ పాస్‌బుక్ ఉన్న రైతులు, పాస్‌బుక్ ఉండి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని రైతులు, పాస్‌బుక్ లేని కౌలు రైతులు అనే మూడు వర్గాల వారికీ ఈ యాప్‌లో లాగిన్ సదుపాయం ఉందన్నారు. రైతులు తమ ఆధార్ సంఖ్య లేదా ఫార్మర్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావచ్చన్నారు.
లాగిన్ అథెంటికేషన్ కోసం ఆధార్ ఓటీపీ లేదా ఆధార్ పేస్ ఆర్డి యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని వినియోగించవచ్చన్నారు.
లాగిన్ అయిన తర్వాత మై ఫామ్ విభాగంలో జిల్లా పరిధిలోని తమ భూమి, సర్వే నంబర్ వివరాలను రైతులు చూసి అవి సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలన్నారు. ఏదైనా భూమి వివరాలు కనిపించకపోతే సింక్ ల్యాండ్స్ విత్ ఫార్మర్స్ రిజిస్ట్రీ బటన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చన్నారు.
పంటల ఎంపికలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు సహా 16 రకాల పంటలను ఎంచుకునే వెసులుబాటు ఉందన్నారు.
భూమి విస్తీర్ణం, పండించే పంట ఆధారంగా జనరల్ ఫెర్టిలైజర్ రికమండేషన్ (జిఎఫ్ఆర్) ఎరువుల పరిమాణాన్ని సూచిస్తుందన్నారు.
రైతులు తమ అవసరానికి తగినట్లుగా ఎరువుల సంచుల పరిమాణాన్ని మార్చుకునే లేదా అదనపు ఎరువులను జోడించుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్న సమీప డీలర్‌ను ఎంచుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయగానే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందన్నారు. జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ రెండు రోజుల వ్యవధి వరకు చెల్లుబాటులో ఉంటుందన్నారు.
రైతు నేరుగా లేదా రైతు తరఫున ప్రతినిధి షాప్‌కు వెళ్లి క్యూఆర్ కోడ్, ఆధార్ ఓటీపీ ధృవీకరణ ద్వారా ఎరువులను పొందవచ్చన్నారు. కౌలు రైతులు, వారసత్వ హక్కుదారులు ఆధార్ మరియు మొబైల్ ఓటీపీల ద్వారా తమ సాగు భూముల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు. పారదర్శక ఎరువుల పంపిణీకి మరియు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి ఈ డిజిటల్ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ALSO READ : బోడుప్పల్ లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెళ్లిన అధికారులపై దాడి..!
.మండలంలోని రైతులందరూ ఈ 6 స్టెప్పుల సరళమైన యాప్‌ను ఉపయోగించు కోవాలన్నారు. యాప్‌కి సంబంధించిన ఏవైనా సందేహాలుంటే సమీప రైతు వేదికల్లోని వ్యవసాయ విస్తరణాధికారులను (ఎఇఓ) సంప్రదించవచ్చన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎంఎఓ ఎం.ఋష్యేంద్రమణి ఉన్నారు.










