Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

కాంగ్రెస్ర్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్‌ భారీ నిరసన..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అందుకు నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దేవరకొండ పట్టణం గులాబీమయంగా మారింది. ర్యాలీతో పట్టణం దద్దరిల్లింది.

కాంగ్రెస్ర్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్‌ భారీ నిరసన..!

చింతపల్లి, మనసాక్షి :

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అందుకు నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దేవరకొండ పట్టణం గులాబీమయంగా మారింది. ర్యాలీతో పట్టణం దద్దరిల్లింది.

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగి బస్‌స్టాండ్‌ వద్దకు చేరుకుంది. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ జెండాలు, గులాబీ కండువాలతో భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో దేవరకొండలో పండుగ వాతావరణం నెలకొంది.

ALSO READమిర్యాలగూడలో రైస్ మిల్లు అడ్డాగా.. రేషన్ బియ్యం పాలిష్ దందా.. ముగ్గురి అరెస్ట్..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ నేనావత్ కిషన్ నాయక్ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని, తన పాలకవర్గంలో ఉన్న మాంత్రిలే ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తున్నారని పాలకవర్గానికి సమాధానం చెప్పలేదు వ్యక్తి రాష్ట్రంలో ప్రజా పాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించలేని ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమన్నారు. చేతకాని పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, నేనావత్ కిషన్ నాయక్, వడ్త్యా రమేష్ నాయక్,అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపిటిసి లు,కౌన్సిలర్లు, మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు