Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ
9,10 తేదీల్లో 70వ మండల స్థాయి క్రీడా పోటీలు..!
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియన్ క్రీడా పోటీలు ఈ నెల 9,10వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ తెలియజేశారు.

9,10 తేదీల్లో 70వ మండల స్థాయి క్రీడా పోటీలు..!
వేములపల్లి, మన సాక్షి:
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియన్ క్రీడా పోటీలు ఈ నెల 9,10వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు మండల విద్యాధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ తెలియజేశారు. ఈ పోటీలలో వాలీబాల్,కబడ్డీ, ఖో-ఖో క్రీడల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
9న బాలికల క్రీడా పోటీలు,10న బాలుర క్రీడా పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు.









