బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మద్ది వేణుగోపాల్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన మద్ది వేణుగోపాల్ రెడ్డి ని నియమిస్తూ ఆ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ ఉత్తర్వులు అందజేశారు.

బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మద్ది వేణుగోపాల్ రెడ్డి
మిర్యాలగూడ, మనసాక్షి :
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన మద్ది వేణుగోపాల్ రెడ్డి ని నియమిస్తూ ఆ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్బంగా మద్ది వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు బాధ్యత అప్పగించి, నాపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలుబ్ తెలిపారు.
ALSO READ : వెలిగల్లు డ్యామ్ వద్ద తల్లీ, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం భగ్నం..!
అలాగే నాపై నమ్మకం ఉంచి ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి , కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ : పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన అలేఖ్య..!
పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కులు మరియు సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, పార్టీ సిద్ధాంతాలు మరియు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తా అన్నారు.









