షోటోకన్ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన పేట విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఈనెల 6న ఫంకోశి షోటోకన్ కరాటే డు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నారాయణపేట జిల్లా డ్రాగన్ షోటోఖాన్ కరాటే డు స్పోర్ట్స్ విద్యార్థులు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు.

షోటోకన్ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన పేట విద్యార్థులు
నారాయణపేట టౌన్, మనసాక్షి:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఈనెల 6న ఫంకోశి షోటోకన్ కరాటే డు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో
నిర్వహించినటువంటి రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నారాయణపేట జిల్లా డ్రాగన్ షోటోఖాన్ కరాటే డు స్పోర్ట్స్ విద్యార్థులు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు.
అండర్ 12 ఫైట్ విభాగంలో ఆదిత్య రేహాన్, బి. చరణ్ కుమార్ గోల్డ్ మెడల్, అండర్ 18 బాలుర ఫైట్ భాగంలో ఏసు సిల్వర్ మెడల్, అండర్ 14 ఫైట్ విభాగంలో గురు చరణ్ కంస్య పథకం సాధించారని డ్రాగన్ షోటోఖాన్ కరాటే డు స్పోర్ట్స్ నేషనల్ చీఫ్ షిహాన్ సలాంబిన్ ఉమర్ మాస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆత్మ రక్షణ కోసం విద్యార్థులకు కరాటే ఎంతగానో తోడ్పడుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ రమణ, అథ్లెటిక్ కోచ్ హారిక దేవీ,డ్రాగన్ షోటోఖాన్ కరాటే డు స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ కె. అంజన్ ప్రసాద్ మాస్టర్, అంబ్రేష్ మాస్టర్ టోర్నమెంట్ ఇంచార్జ్ మొహమ్మద్ సలీం కరాటే మాస్టర్ అశోక్ మండలాల బెల్ట్ టెస్ట్ ఇంచార్జ్ తాయప్ప, కె అనిల్ కుమార్,
తయ్యాబ, శివకుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
MOST VIEWS









