Breaking Newstravelఆంధ్రప్రదేశ్
మదనపల్లి ఆర్టీసీ 2డిపో మేనేజర్ గా తిరుమలరెడ్డిపల్లి వాసి
అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీసీ 2డిపో మేనేజర్ గా లక్ష్మీనారాయణ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం పొందారు.

మదనపల్లి ఆర్టీసీ 2డిపో మేనేజర్ గా తిరుమలరెడ్డిపల్లి వాసి
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీసీ 2డిపో మేనేజర్ గా లక్ష్మీనారాయణ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రామసముద్రం మండలం, తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం పొందారు.
గతంలో మదనపల్లి, పలమనేరు, బెంగళూరు, కుప్పం ఆర్టీసీ డిపోల్లో సీఐ, అసిస్టెంట్ డిపో మేనేజర్, డిపో మేనేజర్ గా తన విధులు నిర్వహించారు. కుప్పం డిపోలో మేనేజర్ గా పని చేస్తూ బదిలీపై మదనపల్లి 2డిపో మేనేజర్ గా వచ్చారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మదనపల్లి టూ డిపోను లాభాల బాటలో నడిపించేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా పనిచేస్తూ, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రద్దీగా ఉండే ప్రముఖ పట్టణాలకు ఎక్కువ సర్వీసులు నడుపుతామని తెలియజేశారు.