Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా వినాయక చవితి వేడుకలు..!

మిర్యాలగూడలోని రెడ్డి కాలనీ కోదండరామాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి.

Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా వినాయక చవితి వేడుకలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడలోని రెడ్డి కాలనీ కోదండరామాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిలకూరు సుధాబాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడి రెక్క ఇంద్ర, మండల అధ్యక్షుడు గుండు నరేందర్, సారెడ్డి శంకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు రేపాల పురుషోత్తం రెడ్డి, సాధినేని శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందేరాము, రామాలయ అధ్యక్షులు పాదూరు ఇంద్రారెడ్డి, కోశాధికారి పుట్ట దయాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొజ్జ మోహన్ రెడ్డి, మోహన్ రామ్ రెడ్డి, రంగా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

మొదటగా శాసనసభ్యులు బిఎల్ఆర్ అతిథుల తో కలిసి పర్యావరణ పరిరక్షణ కోసందేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. శాసనసభ్యులు బిఎల్ఆర్ మాట్లాడుతూ.  నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని, ఈ మట్టి గణపతి పూజ చేయడం వలన నిమజ్జనం రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మట్టి గణపతి ప్రాధాన్యత నివ్వాలని అన్నారు.

ఈ వినాయక చవితి పండుగ పర్యావరణంతో ముడిపడి ఉంటుందని మనం వినాయక చవితి పూజా కార్యక్రమంలో వాడేటటువంటి ఆకులన్నీ కూడా ఔషధాలు అని, అవి కాలువలలో నదులలో వదిలినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్లలోకి పోయి ప్రజలు ఆరోగ్యవంతంగా తయారు కావడానికి దోహదపడుతుందని అన్నారు. కానీ నేటి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఎక్కువగా వాడటం వలన ఆ నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి గణపతి వాడాలని వారన్నారు.

మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, కోదండ రామాలయంలో చేస్తున్నటువంటి వినాయక చవితి సంబరాలలో ముఖ్యమైన ఘట్టమైనటువంటి నిమజ్జన కార్యక్రమం మన దేవాలయంలోని ఈశాన్య ములలో 11 రకాల అభిషేక ద్రవ్యాలతో వినాయక స్వామికి అభిషేకం చేస్తామని అన్నారు. పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతాల తోనే విగ్రహం మొత్తం కరిగిపోయేలా చేయడం జరుగుతుందని ఈ విధంగా చేయడం వలన మేము పర్యావరణాన్ని కాపాడుతున్నామని అన్నారు.

బి ఎల్ ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో చిన్న మట్టి గణపతులను కోదండ రామాలయంలో పెట్టి పట్టణ ప్రజలకు పంచడం జరిగిందని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తున్నామని, ఇకముందు కూడా ఇదే విధంగా చేసేలా ఆ గణపయ్య మాకు తోడ్పాటుని ఉత్సాహాన్ని ఇవ్వాలని అదేవిధంగా మా వార్డు ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరిసంపదలు కలిగేలా ఆ గణపయ్య దీవించాలని చెప్పి వారు వేడుకున్నారు.

మరిన్ని వార్తలు