ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. భరించలేక యువతి ఆత్మహత్య..!
ప్రేమ పేరుతో వేధింపులు అధికారం కావడం తో యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లెనిన్ నగర్ లో యువతి ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై స్థానిక వన్టోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. భరించలేక యువతి ఆత్మహత్య..!
గోదావరిఖని, సెప్టెంబర్ 15, మన సాక్షి
ప్రేమ పేరుతో వేధింపులు అధికారం కావడం తో యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లెనిన్ నగర్ లో యువతి ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై స్థానిక వన్టోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
స్థానికలు లెనిన్ నగర్ కు చెందిన యువతి సి సి నస్పూర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా చదువుతూ ఉండేది. బాధితురాలు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న సమయంలో అదే కళాశాలలో లెక్చరర్ గా పనిచేసే జెట్టి నవీన్ ప్రేమ పేరుతో ఆమెను నిరంతరం వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై కుటుంబ సభ్యులు నవీను పలుమార్లు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని దీంతో సుమారు మూడు సంవత్సరాల క్రితం కుటుంబం గర్రెపల్లి నుండి గోదావరిఖని లేని నగరకు నివాసం మార్చుకున్నట్లు తెలిపారు. అనంతరం బాధితురాలు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని రెండవ ఇంక్లైన్ గనిలో 12 రోజుల అప్రెంటిస్ శిక్షణకు వెళ్లిన సమయంలో అక్కడ ఓవర్ మ్యాన్గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ కూడా ప్రేమ పేరుతో ఆమెను వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ALSO READ : నల్గొండ జిల్లాలో విషాదం.. గణేష్ పూజలో గుండెపోటుతో పూజారి మృతి..!
ఈ ఇద్దరి వేదింపుల కారణంగా బాధితురాలు తన చదువును నిలిపివేసి గోదావరిఖనిలోని గౌతమి నగర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12న ఉదయం సుమారు 10 గంటలకు తండ్రి ఆమెను కంప్యూటర్ సెంటర్ వద్ద దింపి వెళ్లారు సాయంత్రం ఐదు గంటలకు ఆమెకు ఫోన్ చేయగా తాను గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్నానని ఇంటికి వస్తున్నానని తెలిపింది.
అదే రోజు సుమారు 7 గంటలకు నవీను ఫిర్యాదుదారునికి ఫోను చేసి ఆయన కుమార్తె తెలియని పురుగుల మందు సేవించిందని సమాచారం ఇచ్చాడు. అనంతరం నవీను బాధితురాలిని తన కారులో ఫిర్యాదుదారు ఇంటి వద్దకు తీసుకురాగా ఆమె నోటి నుండి నిరుగు వాంతులు కావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అదే కారులో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈనెల 13న సాయంత్రం సుమారు ఐదున్నర గంటలకు బాధితురాలు మృతి చెందింది.









