Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మహిళ మృతదేహం లభ్యం..!

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం బుధవారం లభ్యం అయింది.

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మహిళ మృతదేహం లభ్యం..!

వేములపల్లి, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం బుధవారం లభ్యం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో, గోగువారిగూడెం దగ్గర గుర్తుతెలియని మహిళ మృతదేహం కాలువ నీటిలో కొట్టుకొని రాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో గుర్తింపు నిమ్మిత్తము భద్రపరిచారు.

సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు, బూడిద రంగు టాప్, బ్రౌన్ రంగు పాంట్ దుస్తులు వేసుకుంది.
సుమారు 5 అడుగుల ఎత్తు ఉంది.
ఈ మహిళ ఆచూకీ తెలిసినా లేదా ఎవరైనా తప్పిపోయినట్లు తెలిసినా దయచేసి వెంటనే వేములపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరని చెప్పారు. SI వేములపల్లి సెల్: 8712670190, పోలీస్ స్టేషన్ నెంబర్: 8712670808

MOST READ : 

మరిన్ని వార్తలు