ఇంటీరియో బై గోద్రెజ్ తాజా సోఫా క్యాంపెయిన్.. మనకు నచ్చినట్లుగా మార్చుకునే సరికొత్త సౌకర్యం!
ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ ఇంటీరియో బై గోద్రెజ్ తన తాజా సోఫా క్యాంపెయిన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. "అప్‌మోడ్స్. యువర్ సోఫా, యువర్ వే!" పేరిట రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు తమకు తగినట్లుగా సోఫాను మార్చుకునే సరికొత్త సౌకర్యాన్ని అందిస్తోంది.

ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ ఇంటీరియో బై గోద్రెజ్ తన తాజా సోఫా క్యాంపెయిన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. “అప్‌మోడ్స్. యువర్ సోఫా, యువర్ వే!” పేరిట రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు తమకు తగినట్లుగా సోఫాను మార్చుకునే సరికొత్త సౌకర్యాన్ని అందిస్తోంది. ఒక కుటుంబం కొత్త సోఫా కొనుగోలు కోసం ఇంటీరియో బై గోద్రెజ్ స్టోర్‌కు వెళ్లినప్పుడు ఎదురయ్యే సరదా సంఘటనల ఆధారంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు.
కొత్త సోఫా ఎంపిక విషయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిరుచులు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. టీనేజ్ కొడుకు ఛేజ్ సోఫా కావాలని కోరుకుంటే, తండ్రి ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్న సోఫా కావాలని అడుగుతాడు. అలాగే భార్య ఇళ్లలో వస్తువులు దాచుకోవడానికి స్టోరేజ్ ఉన్న సోఫా గురించి చెబుతుంటే, అమ్మమ్మ మాత్రం తమ పెంపుడు కుక్కకు ఇష్టమైన నీలిరంగు సోఫా ఉండాలని కోరుకుంటుంది. ఇలా కుటుంబ సభ్యుల అందరి భిన్నమైన అవసరాలను ఒకే చోట చేర్చేలా అప్‌మోడ్స్ సోఫాలను మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చని సేల్స్‌పర్సన్ వారికి వివరిస్తాడు.
ఇంటీరియో బై గోద్రెజ్ హెడ్ రెషు సరాఫ్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి సొంత ఆలోచనలు ఉంటాయని, మా అప్‌మోడ్స్ రేంజ్‌తో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా సోఫాను రూపొందించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి సౌకర్య భావన వేరుగా ఉంటుందని, అదనపు లెగ్‌రూమ్, ఫోన్ ఛార్జింగ్ స్థలం, స్టోరేజ్ లేదా ఇష్టమైన రంగు వంటి అన్నీ రకాల ఎంపికలు ఇందులో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
సింగిల్ , డ్యూయల్-టోన్ కాంబినేషన్లతో సహా దాదాపు 25 రంగుల ఆప్షన్లు, లెదర్ , ఫ్యాబ్రిక్ ఎంపికలతో ఈ సోఫాలు లభిస్తాయి. ఏకంగా 1750కి పైగా విభిన్న కాన్ఫిగరేషన్‌లతో కుటుంబంలో ఎవరూ ఎలాంటి రాజీ పడకుండా తమకు నచ్చిన రీతిలో సోఫాను తీర్చిదిద్దుకోవచ్చు. థండర్ ఫిలిమ్స్ నిర్మాణంలో, సందీప్ యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యూట్యూబ్, సోషల్ మీడియా , ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానుంది. ఆధునిక భారతీయ ఇళ్ల కోసం కార్యాచరణ, ఆకర్షణ , మనకు తగినట్లుగా మలచుకునే సౌకర్యాన్ని మిళితం చేసే ఫర్నిచర్ పరిష్కారాలను సృష్టిస్తూ ఇంటీరియో తన డిజైన్ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళుతోంది.









