Miryalaguda : ఫీజుల బకాయిలు, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్సీకి వినతి..!
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజేత డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు.

Miryalaguda : ఫీజుల బకాయిలు, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్సీకి వినతి..!
విద్యార్థుల భవిష్యత్తు.. బకాయిల బంధం! రీయింబర్స్‌మెంట్,
స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూపులు
ఫీజుల బకాయిలతో యాజమాన్యాలు, అధ్యాపకులకు ఆర్థిక ఇబ్బందులు
మిర్యాలగూడ, మన సాక్షి :
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజేత డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ్ సూచనల మేరకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ALSO READ : Nalgonda : నల్గొండ జిల్లాలో హైవేపై మంటల్లో కాలిపోయిన లారీ..!
గత ప్రభుత్వం హయాంలో రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యం జరగడంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల బకాయిలు అందకపోవడంతో అధ్యాపకులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి, పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మధు, చారి, యాదయ్య, హరి, దుర్గయ్య, రాజారాం, రాంరెడ్డి, సతీష్, వీరయ్య, బాలాజీ, సంతోష్, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.









