ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడుగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందాడు.

ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడుగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందాడు. ఆయన చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తూ గుండె నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన జైలు సిబ్బంది హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అబ్దుల్ బారీ అక్కడే కన్నుమూశాడు.
నల్గొండ పట్టణానికి చెందిన అబ్దుల్ బారీ గతంలో గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో శిక్ష అనుభవించాడు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్గొండలో జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అబ్దుల్ భారీ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామవత్ శంకర్ నాయక్ అకాల మరణం..!
హత్య కేసులో కోర్టు కీలక తీర్పు :
ప్రణయ్ హత్య కేసులో గత ఏడాది మార్చిలో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఏ 1 గా ఉన్న మారుతి రావు 2020లో ఆత్మహత్యకు పాల్పడగా ఏ 2 సుభాష్ శర్మ, ఏ 3 అజ్గర్ అలీ, ఏ 4 అబ్దుల్ బారీ, ఏ 5 కరీం, ఏ 6 శ్రావణ్ కుమార్, ఏ 7 శివ, ఏ 8 నిజామ్ లను కోర్టు దోషులుగా తేల్చిన సంగతి విధితమే.









