Miryalaguda : వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. నీ బండారం బయటపడుద్ది.. ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ నాయకుల కౌంటర్..!
మాజీ మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై దామరచర్ల మండల బీఆర్ఎస్ పార్టీ కమిటీ, నాయకులు తీవ్రంగా స్పందించారు.

Miryalaguda : వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. నీ బండారం బయటపడుద్ది.. ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ నాయకుల కౌంటర్..!
కేటీఆర్, జగదీష్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు
మిర్యాలగూడ, మన సాక్షి :
మాజీ మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై దామరచర్ల మండల బీఆర్ఎస్ పార్టీ కమిటీ, నాయకులు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రెడ్డికాలని బారాస పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ పలు అంశాలను వివరించారు.
Also Read : తల్లిని హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే..?
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతులకు విద్యుత్ సరఫరా, రెండు పంటలకు సాగునీటి విడుదల వంటి ప్రధాన సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తోందని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద నిర్వహించిన ధర్నా సందర్భంగా రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే బీఆర్ఎస్ నాయకుల ఉద్దేశమని అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేయడం కాకుండా, రైతుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ , మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన అదికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి కి ఎం తెలుసనీ నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలందరికి తెలుసునని అన్నారు.
మీ హయంలో, మీ చేతకాని పాలనలో నియోజకవర్గ అభివృద్ధి ఇంకొక 10 సంవత్సరాలు వెనిక్కి వెళ్లిందని వాపోయారు. నియోజకవర్గానికి పట్టిన దరిద్రానివి నువ్వు పోతే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ సంగతి కూడా ప్రజలందరికి తెలుసునని మీరు రాజకీయాలలో రాకముందు మీ అఫడవిట్ లో పొందుపరచిన ఆస్తుల వివరాలు ఏందో ఇప్పుడు ఎలా డబుల్, త్రిబుల్ అయిందో అందరికి తెలుసు అన్నారు.
Also Read : Miryalaguda : చట్టాలు కాగితాల మీద కాదు.. అమలులో ఉండాలి..!
ఇంకా ఎన్నికల చివరి నిమిషం వరుకు మీ 120 లారీలు అన్ని వేలంపాటకి వెళ్ళే స్థితి నుంచి మళ్ళి ఎలా వెనక్కు వచ్చాయో, మీ అక్రమ సంపాదన గురించి అందరికి తెలుసు లక్ష్మా రెడ్డి.. ఖబడ్దార్ నీ బండారం అంత ఇంకొద్ది రోజులలో బయటపడుతుందని నిన్ను మరల ఆంద్రాకు పంపే వరకు నియోజకవర్గ ప్రజలు ఏమి విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. 556 కోట్ల రూపాయలతో మా దామరచర్ల ఉమ్మడి మండలంలో 4 ఎత్తిపోతల పథకాలు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మంజూరు చేయిస్తే అవి కూడా చేయించలేని చేతకాని దద్దమ్మ వి నువ్వు …! ఇంకా నువ్వు అభివృద్ధి, నీతి నిజాయతి , చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నావ్.. ఇంకో సారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక కోస్తామని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎండి. యూసుఫ్, దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బైరం సంపత్, మాజీ జడ్పీటీసీ అంగోతు లలిత హాతిరాం నాయక్, ఏ ఏం సి మాజీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు సోము సైదిరెడ్డి, ధీరావత్ పాచు నాయక్, మాజీ సర్పంచ్ లావూరి శ్రీను నాయక్, ఉద్యమ నాయకులు కొండారపు నాగేశ్వర్ రావు, కొండారపు శ్రీనివాస్, రాష్ట్ర బి ఆర్ ఎస్ వి కార్యదర్శి ఎండి.షోయబ్, యువజన నాయకుడు రమావత్ వినోద్ నాయక్, వాంకు డోతు అఖిల్ నాయక్, ధీరావత్ మెగా నాయక్* తదితరులు పాల్గొన్నారు.









