Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణపండుగలుహైదరాబాద్

గణేష్ నిమజ్జనాల్లో 13 మంది మృతి..!

తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పై డిజిపి సివి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.

గణేష్ నిమజ్జనాల్లో 13 మంది మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పై డిజిపి సివి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జన బందోబస్తులో ఉన్న ఎస్సై ప్రమాదంలో మృతిచెందగా పటాన్ చెరువులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్, నిర్మల్ లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా డీజే సౌండ్స్ తో గుండెపోటు గురై మరో వ్యక్తి మృతి చెందారు. నిమజ్జనాలలో 13 మంది మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

Also Read : District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌..!

నిమజ్జనాలలో మొత్తం 26 మంది గాయపడగా ఒక్క మల్కాజ్గిరి లోనే 16 మందికి గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు విడతల్లో నిమజ్జనాలు జరుగుతుండగా హైదరాబాదులో గణేష్ నిమజ్జనాల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు అత్యంత భద్రత వాతావరణంలో కొనసాగాయి. ఐసీసీసి, డిజిపి కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు డిజిపి ఆనంద్ పేర్కొన్నారు.

Also Read : తల్లిని హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే..?

రాష్ట్ర వ్యాప్తంగా జియో టాకింగ్ సంబంధిత పోర్టల్ లో నమోదైన సమాచారం ప్రకారం ఈ ఏడాది పబ్లిక్ ప్లేస్లలో 1,24 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించామని డిజిపి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 8,000 విగ్రహాలు అదనంగా ఏర్పాటైనట్లు ఆయన చెప్పారు. హైదరాబాదులో నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టిందని డీజిపి తెలిపారు.

మరిన్ని వార్తలు