Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణవ్యవసాయం

అన్నదాతకు ఊరట..!

తెలుగు రాష్ట్రాలలో అన్నదాతకు ఊరట కలిగింది. ఇటీవల తుఫాన్ కారణంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు సంతోషంలో ఉన్నారు.

అన్నదాతకు ఊరట..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో అన్నదాతకు ఊరట కలిగింది. ఇటీవల తుఫాన్ కారణంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు సంతోషంలో ఉన్నారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు కురవడంతో అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఎండలకు చెరువులు కుంటల్లో నీరు ఎండిపోవడంతో బోర్లు బావుల్లో కూడా నీరు లేకుండా పోయాయి.

అంతేకాకుండా మెట్ట పంటలు వేసిన రైతులకు కూడా వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పత్తి చేలు పూర్తిగా వాడు పట్టాయి. కాగా ఇటీవల కురిసిన వర్షాలతో మళ్ళీ పత్తి చేలకు ప్రాణం వచ్చింది. అంతేకాకుండా బోర్లు బావులలో కొద్దిపాటి నీరు రావడం వల్ల వారి పంటలకు కూడా జీవం వచ్చింది. ఎండిపోతాయని ఆందోళన చెందిన రైతులకు ఇటీవల కురిసిన తుఫాన్ వల్ల ప్రాణం వచ్చింది. ఏది ఏమైనా తుఫాన్ కారణంగా అన్నదాతకు ఊరట కలిగింది.

Most Read : 

మరిన్ని వార్తలు