Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

ఆర్ముర్ లో బట్టల షాప్ ఓపెనింగ్ గందరగోళం.. రూ.9లకే డ్రెస్ ఆఫర్‌.. ఎగబడిన జనం, తోపులాట..! 

నిజామాబాదు జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన "కిడ్స్ వరల్డ్" పిల్లల బట్టల షాప్ ప్రారంభోత్సవం తీవ్ర కలకలానికి దారి తీసింది.

ఆర్ముర్ లో బట్టల షాప్ ఓపెనింగ్ గందరగోళం.. రూ.9లకే డ్రెస్ ఆఫర్‌.. ఎగబడిన జనం, తోపులాట..! 

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాదు జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన “కిడ్స్ వరల్డ్” పిల్లల బట్టల షాప్ ప్రారంభోత్సవం తీవ్ర కలకలానికి దారి తీసింది. విజయ పబ్లిక్ స్కూల్ పక్కన నూతనంగా ప్రారంభమైన ఈ షాప్‌లో రూ. 9, రూ. 39, రూ. 69, మరియు రూ. 89లకే పిల్లల దుస్తులు లభిస్తాయని నిర్వాహకులు సోషల్ మీడియా (ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్) వేదికగా విస్తృత ప్రచారం చేశారు.

ఈ ప్రకటనలు చూసి ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో జనాలు, ముఖ్యంగా మహిళలు ఒక్కసారిగా షాప్‌ వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా జనం ఉప్పెనలా రావడంతో షాపు పరిసర ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. షాపులోకి చొచ్చుకెళ్లే క్రమంలో తోపులాట జరిగింది.

Also Read : Nalgonda : నల్గొండలో దారుణం.. అపార్ట్ మెంట్ లో వ్యక్తి హత్య..!

ఈ క్రమంలో తీవ్ర ఆగమాగం నెలకొనడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇదే అదునుగా భావించిన కొందరు మహిళలు, ఆకతాయిలు షాప్‌లోని బట్టలను పట్టుకుని బయటకు పారిపోవడంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చెయ్యి దాటి పోతుండటంతో సమాచారం అందుకున్న ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తన పోలీసు బలగాలతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనాన్ని అదుపు చేస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా పోలీసులు సదరు కిడ్స్ వరల్డ్ షాప్‌ను వెంటనే మూసివేయించారు. ఎటువంటి ముందస్తు అనుమతులు, సరైన భద్రతా చర్యలు లేకుండా భారీ ఆఫర్లతో జనాలను సమీకరించి ట్రాఫిక్, ఆందోళనకు కారణమైన షాపు నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు