మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. కన్న తండ్రిని కొట్టి హత్య చేసిన కుమారుడు..!
కన్న తండ్రినే కొడుకు కొట్టి హత్య చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. నవాబు పేట్ మండల దేపల్లి గ్రామంలో తండ్రిని కొట్టి చంపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. కన్న తండ్రిని కొట్టి హత్య చేసిన కుమారుడు..!
మహబూబ్ నగర్, మన సాక్షి జిల్లా ప్రతినిధి :
కన్న తండ్రినే కొడుకు కొట్టి హత్య చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. నవాబు పేట్ మండల దేపల్లి గ్రామంలో తండ్రిని కొట్టి చంపిన ఘటన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
రాపోలు రాములు (55) ను రెండవ కొడుకు కొట్టి హత్య చేశాడు. కొడుకు రాపోల్ సురేందర్ ప్రతిరోజు తాగి ఖాళీగా తిరుగుతూ ఉన్నాడని తండ్రి మండలించేవాడు. అది మనసులో పెట్టుకొని తండ్రిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో శనివారం సాయంత్రం కర్రతో, రాయితో తలపై బలంగా కొట్టడం జరిగింది.
Also Read : Nalgonda : నల్గొండలో దారుణం.. అపార్ట్ మెంట్ లో వ్యక్తి హత్య..!
తలపై గాయాలు తో తండ్రి రాపోలు రాములు వాకిట్లో పడిపోయాడు. అది గమనించిన ఇంటి పక్కన ఉన్నవారు రాపోలు జంగయ్య, రాపోల్, నరసింహులు, చూసి రక్తపు గాయాలతో ఉన్న రాములు, ఇంట్లోకి తీసుకెళ్లి పరిశీలించగా ఇప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
స్థానికులు మృతుడి పెద్దకొడుకుకు ఫోన్ చేసి విషయాలను తెలుపగా పెద్ద కొడుకు రాపోల్ శ్రీకాంత్ వచ్చి తండ్రిని చూసేలోపు నిందితుడు సురేందర్ పరారయ్యాడు. తండ్రి చావు కి కారణమైన తమ్ముడు సురేందర్ పై చర్యలు తీసుకోవాలని మృతుని పెద్ద కొడుకు శ్రీకాంత్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.









