రెండు రోజుల క్రితం ఓయోలో దిగిన జంట.. రక్తపు మడుగులో యువతి.. పరారీలో యువకుడు..!
హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ లో ఓయో హోటల్లో ఓ యువతి హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం ఓయో హోటల్లో ఒక జంట దిగింది. మంగళవారం ఉదయం చూసేసరికి యువతి విగతజీవిగా కనిపించింది.

రెండు రోజుల క్రితం ఓయోలో దిగిన జంట.. రక్తపు మడుగులో యువతి.. పరారీలో యువకుడు..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ లో ఓయో హోటల్లో ఓ యువతి హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం ఓయో హోటల్లో ఒక జంట దిగింది. మంగళవారం ఉదయం చూసేసరికి యువతి విగతజీవిగా కనిపించింది. ఆమె వెంట వచ్చిన యువకుడు కనిపించకపోవడంతో పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
మొదటగా అనుమానాస్పద పరిస్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే మిస్టరీని ఛేదించారు. ఆ యువతి మృతిని పోలీసులు హత్యగా నిర్ధారించుకున్నారు. ఆమెతో వచ్చిన వ్యక్తి హత్య చేసి పరారైనట్లుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. మృతురాలిది వికారాబాద్ జిల్లా ధరూర్ కు చెందిన శిరీషగా గుర్తించారు. కానీ ఆధార్ కార్డు లో దుర్గ అని ఉన్నట్లు సమాచారం.
Also Read : Gold Price : ఒకేసారి కుప్పకూలిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
శిరీష కోటిపల్లి కి చెందిన శ్రీనివాస్ తో ప్రేమలో ఉండి రెండు రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయింది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లోని ఓయో హోటల్ గదిలో బస చేసింది. హోటల్ గదిని సి గణేష్ పేరు తో బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం ఉదయం మాత్రం శిరీష రక్తపుమడుగులో మంచం మీద పడి ఉంది. శ్రీనివాస్ కనిపించకపోవడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మద్యం సేవించడంతో పాటు ఆహారం మధ్యలోనే వదిలేసిన ఆనవాళ్లు కూడా గదిలో ఉన్నాయి. శిరీష కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.









