Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

పటాన్చెరు, (మనసాక్షి) :

ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు, కమ్యూనిటీ ప్రతినిధులు మరియు సెక్యూరిటీ సిబ్బందికి రాత్రిపూట జరిగే దొంగతనాల నివారణపై పోలీసులు అవగాహన కల్పించారు. దొంగల ముఠాలు ముందుగా రెక్కీ నిర్వహించి, ఒంటరి ఇళ్లు తాళం వేసిన నివాసాలు తక్కువ భద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సెక్యూరిటీ సిబ్బంది రాత్రివేళల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ప్రధాన ప్రవేశ–నిష్క్రమణ ద్వారాలు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర సున్నితమైన ప్రదేశాలను పర్యవేక్షించాలి. అవసరమైన చోట అదనపు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని భద్రతను పటిష్టం చేసుకోవాలి. సిసిటివి కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తనిఖీ చేసి, రాత్రివేళల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాలి.

అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు లేదా రెక్కీ చేస్తున్నట్లు కనిపించే వ్యక్తులను గమనించినప్పుడు వారి వాహన నంబర్, దుస్తులు, వెళ్లిన దిశ తదితర వివరాలను నమోదు చేసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు పొరుగువారికి లేదా కమ్యూనిటీ సెక్యూరిటీ సిబ్బందికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలి.

ఏదైనా అనుమానాస్పద వ్యక్తి, వాహనం లేదా చోరీ ప్రయత్నం కనిపిస్తే వెంటనే డయల్ 112కు లేదా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సిఐ వి. సుధీర్ కుమార్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది.

మరిన్ని వార్తలు