జాతీయస్థాయి ఆర్చరీలో సిల్వర్ మెడల్ సాధించిన తాటి పెళ్లి అశ్వజ
సీబీఎస్ఈ జాతీయస్థాయి ఆర్చరీ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించిన తాటి పెళ్లి అశ్వజ. బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి డివిజన్ కి చెందిన తాటి పెళ్లి అశ్వజ జాతీయస్థాయి ఆర్చరీలో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

జాతీయస్థాయి ఆర్చరీలో సిల్వర్ మెడల్ సాధించిన తాటి పెళ్లి అశ్వజ
మేడిపల్లి, మన సాక్షి :
సీబీఎస్ఈ జాతీయస్థాయి ఆర్చరీ టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ సాధించిన తాటి పెళ్లి అశ్వజ. బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి డివిజన్ కి చెందిన తాటి పెళ్లి అశ్వజ జాతీయస్థాయి ఆర్చరీలో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పానిపాట్ హర్యానాలో జాతీయస్థాయి ఆర్చరీ పోటీలు జరిగాయి. దీనిలో అర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఉప్పల్ తెలంగాణ కు చెందిన 11 వక్లాస్ విద్యార్థిని జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించింది.
ఈ నెల 26న జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం,ఉప్పల్ లోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన తాటిపెల్లి అశ్వజ 11వ తరగతి విద్యార్థిని 664/720 స్కోర్ తో జాతీయ స్థాయి లో 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది.
Also Read : Miryalaguda : గడువు తేదీ ముగిసిన పురుగు మందులు విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయధికారుల హెచ్చరిక..!
ఇండియా లోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన 80 మంది ఆర్చరీ క్రీడాకారులకు జరిగిన పోటీలలోతాటిపెళ్ళి అశ్వజ 664/720 స్కోర్ సాధించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో బ్రోంజ్ మెడల్ సాధించింది. దీనితో తాటిపెళ్ళి అశ్వజ కు మహారాష్ట్రలో జాతీయస్థాయిలో జరిగే ఆర్చరీ టోర్నమెంట్ కు డైరెక్టుగా పాల్గొనే అవకాశం లభించింది.
అశ్వజా ప్రాక్టీస్ మొదలుపెట్టిన 16 నెలల్లోనే జాతీయ స్థాయిలో సిల్వర్, బ్రోంజ్ మెడల్ సాధించడం ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి చాలా గర్వంగా వుంది అంటూ స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.









