Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

షటిల్ ఆడుతూ ఆరోగ్యశాఖ ఉద్యోగి మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ షటిల్ గ్రౌండ్‌లో సోమవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.

షటిల్ ఆడుతూ ఆరోగ్యశాఖ ఉద్యోగి మృతి

సూర్యాపేట మన సాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ షటిల్ గ్రౌండ్‌లో సోమవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న వెలుగు కరుణాకర్‌ (60) షటిల్ ఆడుతుండగా రాత్రి 7.45 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు.

వెంటనే అక్కడే సీపీఆర్‌ నిర్వహించి, పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం మేరకు.. కరుణాకర్‌ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడిగా కూడా సేవలందిస్తున్నట్లు సహచరులు తెలిపారు. ఈ ఘటనతో సహచర ఉద్యోగులు, షటిల్‌ క్రీడాకారుల్లో విషాదం నెలకొంది.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు