Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

శిఖం.. ఖతం..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తానేదారిపల్లి గ్రామ పెద్ద చెరువు భూములు భారీగా ఆక్రమణకు గురైనట్లు స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

శిఖం.. ఖతం..!

20 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం

గుర్రంపోడు, మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తానేదారిపల్లి గ్రామ పెద్ద చెరువు భూములు భారీగా ఆక్రమణకు గురైనట్లు స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చారిత్రక పెద్ద చెరువు పరిధిలో, సుమారు 20 ఎకరాల శిఖం మరియు బఫర్ జోన్ భూమి అక్రమంగా కబ్జాకు గురైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

గ్రామ వ్యవసాయానికి, భూగర్భ జలాల పెంపునకు కీలకమైన ఈ చెరువు పరివాహక ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి, సాగు భూములుగా మార్చడం లేదా ఇతర అక్రమ నిర్మాణాలకు వాడుతున్నట్లు సమాచారం.

Also Read : దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

ఈ ఆక్రమణల వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడటమే కాకుండా, రాబోయే రోజుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మరియు నీటి పారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి, డిజిటల్ సర్వే నిర్వహించి చెరువు సరిహద్దులను నిర్ణయించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : షటిల్ ఆడుతూ ఆరోగ్యశాఖ ఉద్యోగి మృతి

అక్రమ కబ్జాలను తొలగించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు మరియు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు సమాయత్తమవుతున్నారు.

మరిన్ని వార్తలు