కళ్ల ఎదుటే కారు దగ్ధం.. తండ్రి సజీవ దహనం, కొడుకుని కాపాడిన స్థానికులు..!
కళ్ళ ఎదుట కారులో మంటలు చెలరేగాయి. మరో రెండు అడుగుల దూరంలో వెళ్తే ఇంట్లోకి వెళ్లేవారు. అంతలోనే భారీ శబ్దం.. కారులో మంటలు చెలరేగి తండ్రి సజీవ దహనం అయ్యాడు. కొడుకును స్థానికులు కాపాడారు

కళ్ల ఎదుటే కారు దగ్ధం.. తండ్రి సజీవ దహనం, కొడుకుని కాపాడిన స్థానికులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కళ్ళ ఎదుట కారులో మంటలు చెలరేగాయి. మరో రెండు అడుగుల దూరంలో వెళ్తే ఇంట్లోకి వెళ్లేవారు. అంతలోనే భారీ శబ్దం.. కారులో మంటలు చెలరేగి తండ్రి సజీవ దహనం అయ్యాడు. కొడుకును స్థానికులు కాపాడారు. వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఐపిడి కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా హరికృష్ణ నివాసం ఉంటున్నాడు. అతడు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ముదరడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కాగా 55 సంవత్సరాల తండ్రిని చూసుకునేందుకు కొడుకు అఖిలేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తండ్రివద్దె ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే మంగళవారం కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు ఉదయం 9 గంటల సమయంలో తండ్రి కొడుకులిద్దరూ కారులో వెళ్లారు. అఖిలేష్ కార్ డ్రైవింగ్ చేస్తుండగా హరికృష్ణ వెనుక సీట్లో కూర్చున్నాడు. అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు.
Also Read : Gold Price : ఒకేసారి కుప్పకూలిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
మరికొద్ది అడుగుల్లోనే తమ ఇంటికి వెళ్తారనుకున్న సమయంలో కారులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దాంతో అఖిలేష్ వెంటనే కారు ఆపేశాడు. ఒక్కసారిగా కారులో మంటలు మొదలయ్యాయి. దాంతో పాటు కార్ డోర్స్ కూడా వెంటనే లాక్ అయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు అఖిలేష్ వైపు ఉన్న డోర్ అద్దం పగల కొట్టి ఓపెన్ చేశారు. అప్పటికే అఖిలేష్ కి మంటలు అంటుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అటువైపు ఉన్న హరికృష్ణ ను కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు పెరిగి పోయాయి. దాంతో అతనిని రక్షించలేకపోయారు. అప్పటికే హరికృష్ణ కూర్చున్న సీటులోనే మంటలు అంటుకొని చనిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని మార్చేరికి తరలించారు. డీజిల్ కారులో ఏసీ పేలడంతోనే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కళ్ల ఎదుటే కారు దగ్ధం.. తండ్రి సజీవ దహనం, కొడుకుని కాపాడిన స్థానికులు..!









