Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి 11 నెలల పసికందు మృతి..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తూ నీళ్ళ సంపులో పడి 11 నెలల పసికందు మరణించిన విషాద సంఘటన గుర్రంపోడు మండలం పరిధిలోని కొనాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి 11 నెలల పసికందు మృతి..!

గుర్రంపోడు,మన సాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తూ నీళ్ళ సంపులో పడి 11 నెలల పసికందు మరణించిన విషాద సంఘటన గుర్రంపోడు మండలం పరిధిలోని కొనాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, మమత దంపతుల కుమారుడు ఓర్సు స్టాలిన్ (11 నెలలు). ఉదయం బాబు, అతని తల్లి మమత ఇంట్లో పడుకున్నారు. ఆ సమయంలో నిద్రలేచిన బాబు పాక్కుంటూ ఇంటి ముందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న నీళ్ళ సంపులో ప్రమాదవశాత్తూ పడిపోయాడు.

గమనించే లోపే బాబు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని తల్లి ఓర్సు మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రంపోడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంతో కొనాయిగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు