Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన..!

మిర్యాలగూడ మండలంలో సోమవారం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

Miryalaguda : ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలంలో సోమవారం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమని, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు. స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవాలని సూచించారు.

Also Read : Nizamabad : పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హోటల్ యజమాని..!

జీవామృతం, బీజామృతం, వేప ఆధారిత కషాయాలు, మల్చింగ్ తదితర సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా నేల సారాన్ని పెంపొందించుకోవచ్చని అధికారులు తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా రైతులు, కృషి, సఖి, ముదిరెడ్డి సందీప, చల్లా నాగమ్మ, పద్మ, నాగిరెడ్డి, రవి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఈవో రమేష్, మిర్యాలగూడ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పలు సూచనలు అందించారు.

మరిన్ని వార్తలు