జైలర్ గా పనిచేసిన జైలుకే ఖైదీగా..!
జైలర్ గా పనిచేసిన జైలుకే ఖైదీగా వెళ్ళిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

జైలర్ గా పనిచేసిన జైలుకే ఖైదీగా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
జైలర్ గా పనిచేసిన జైలుకే ఖైదీగా వెళ్ళిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని అజ్మీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను తన ప్లాట్ క్లీన్ చేయడానికి జైలర్ దివ్య చౌదరి తీసుకెళ్లింది. అయితే ఆ మహిళా ఖైదీలు ఇద్దరు కూడా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. దాంతో దివ్య చౌదరి పై కేసు నమోదయింది.
కోర్టు నుంచి ఎటువంటి అనుమతి లేకుండా జైలు రికార్డుల్లో నమోదు చేయకుండా జూలై 12వ తేదీన ఓ ప్రైవేటు వాహనంలో ఆ ఖైదీలను దివ్య చౌదరి అజ్మీర్ లోని తన ప్లాట్ కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాంతో జైలర్ దివ్య చౌదరి తో పాటు జైలు గార్డు సోనియా చౌదరిలను కూడా ఉద్యోగాల నుంచి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అప్పటినుంచి ఆమె పరారీలో ఉంది. కాగా బుధవారం ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. దాంతో జైలర్ దివ్య చౌదరిని అజ్మీర్ జైలులోనే ఖైదీగా పంపించారు. ఆమె పని చేసిన జైల్లోనే ఖైదీగా మారింది.









