కరెంట్ కోతలపై రోడ్డెక్కిన రైతులు..!
కరెంట్ కోతలతో ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంట్ కోతలపై రోడ్డెక్కిన రైతులు..!
– తడ్కల్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా ,
– రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలి,
– మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఫైర్
కంగ్టి, మన సాక్షి :-
కరెంట్ కోతలతో ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఎదుట రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు కంగ్టి – పిట్లం ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ … లో- వోల్టేజీ సమస్యలు అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రైతులకు 12 గంటలు కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం ఆరు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. పొట్టదశలో ఉన్న వరికి ఎక్కువ నీరు అవసరమ వుతుందని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుం దన్నారు. రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయడం లేదన్నారు. కరెంట్ సక్రమంగా లేక పంటలు ఎండుపోతున్నాయని,
రైతుల గోస పట్టించుకోకుండా, నాణ్యమైన కరెంట్ సరఫరా చేయకుండా ఎల్నినో పేరు చెప్పి మోసం చేస్తుందన్నారు.
కరోనా సమయంలో కూడా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి అండగా నిలిచిందన్నారు. రైతుభరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోగా ఎగనామం పెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, బీఆర్ఎస్ కార్యకర్తలు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఏడి నాగిరెడ్డికి మన సాక్షి వివరణ కోరగా పై అధికారులతో మాట్లాడి రైతన్నల పంటలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. విద్యుత్ అధికారులు ఏఈ శోభరాణి సిబ్బంది ఉన్నారు.









