Nalgonda : కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామస్తుల సంచలన నిర్ణయం.. బెల్ట్ షాపులు ఉండొద్దని ఏకగ్రీవ తీర్మాణం..!
కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో బెల్ట్ షాపులను నిర్వహించవద్దని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నామని అట్టి ప్రతిని గ్రామ సర్పంచ్ విజయ కృపాకర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ లు విడుదల చేశారు.

Nalgonda : కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామస్తుల సంచలన నిర్ణయం.. బెల్ట్ షాపులు ఉండొద్దని ఏకగ్రీవ తీర్మాణం..!
కేతేపల్లి, మనసాక్షి :
కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో బెల్ట్ షాపులను నిర్వహించవద్దని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నామని అట్టి ప్రతిని గ్రామ సర్పంచ్ విజయ కృపాకర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా తో పాటు కేసులు కూడా నమోదు అవుతాయని హెచ్చరించారు. ఇట్టి తీర్మానం కాపీని కేతేపల్లి ఎస్సై యు సతీష్ కు, నకిరేకల్ సిఐ చంద్రశేఖర్, ఎస్సై రాధలకు అందించారు.
ఈ సందర్భంగా బెల్ట్ షాపులు నివారణకు అధికారులు సహకరించాలని, తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరైనా బిల్ షాపులు నిర్వహిస్తే వాటిపై వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంధ్య, వార్డ్ మెంబర్లు గాజుల ప్రసాద్, చింతపల్లి ఆరోగ్యయ్య, తదితరులు పాల్గొన్నారు.