ఎస్.వి.ఎస్ వైద్యునికి ప్రఖ్యాత ఫెలోషిప్ అవార్డు..!
ఎస్. వి. ఎస్ వైద్య కళాశాల,ఆసుపత్రిలో చాతి మరియు ఊపిరితిత్తుల విభాగంలో ఆచార్యునిగా పనిచేస్తున్న డా. తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి చాతి వైద్యంలో చేసిన పరిశోధనలు మరియు కృషికి గాను ప్రఖ్యాత భారత థోరాసిక్ ఎండోస్కోపీ సొసైటీ ఫెలోషిప్ అవార్డుతో సన్మానించింది.

ఎస్.వి.ఎస్ వైద్యునికి ప్రఖ్యాత ఫెలోషిప్ అవార్డు..!
మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:
ఎస్. వి. ఎస్ వైద్య కళాశాల,ఆసుపత్రిలో చాతి మరియు ఊపిరితిత్తుల విభాగంలో ఆచార్యునిగా పనిచేస్తున్న డా. తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి చాతి వైద్యంలో చేసిన పరిశోధనలు మరియు కృషికి గాను ప్రఖ్యాత భారత థోరాసిక్ ఎండోస్కోపీ సొసైటీ ఫెలోషిప్ అవార్డుతో సన్మానించింది.
ఈ అవార్డును నోయిడా లో జరిగిన కాన్ఫరెన్స్ లో ప్రఖ్యాత ఛాతి వైద్య నిపుణులు, ఎయిమ్స్ న్యూఢిల్లీ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియ రిపబ్లిక్ టివి చైర్మన్ అర్ణబ్ గోస్వామి మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఎనిమిది మంది డాక్టర్లలో దక్షిణ భారతదేశం నుండి అందుకున్న ఏకైక వైద్యుడు మన ఎస్. వి.ఎస్ వైద్యుడు కావడం విశేషం.
ఈ అవార్డును అందుకున్నందుకు గాను డా. తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి ఎస్. వి. ఎస్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ డా.జోషి, మెడికల్ సూపరింటెండెంట్ డా.హరిప్రసాద్ రెడ్డి, చాతి వైద్య విభాగాదిపతి డా. ప్రద్యుత్ వాగ్రే, ప్రొఫెసర్ కోటేశ్వర రావ్ మరియు ఇతర వైద్య సిబ్బంది అభినందించారు.