ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై కేసు..!
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నగరంలోని పోలీస్ శాఖ చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు అయింది.

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై కేసు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నగరంలోని పోలీస్ శాఖ చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు అయింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ ఓ మహిళ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కు చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి పై కేసు నమోదు అయింది.
వివరాల ప్రకారం.. 2016 సంవత్సరంలో సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తో పరిచయం అయింది. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెతో బాలస్వామి సన్నిహిత్యం పెంచుకున్నాడు.
అంతేకాకుండా 2016 నుంచి ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడని ఆ మహిళ తన ఫిర్యాదుల పేర్కొంది. అయితే ఇటీవల పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆయన మాట దాటవేసి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన బలమైన సాక్షాధారాలు ఫిర్యాదు ఆధారంగా డిఐ బాలస్వామి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.









