Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ఎస్ బి ఐ లో ఆ ప్యాకేజ్ కలిగి ఉంటే ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా..!

ఎస్ బి ఐ లో శాలరీ ప్యాకేజ్ ఉండి దురదృష్ట వశాత్తు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా వస్తుందని ఎస్ బి ఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది తెలిపారు.

Nalgonda : ఎస్ బి ఐ లో ఆ ప్యాకేజ్ కలిగి ఉంటే ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా..!

రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ జిల్లా పోలీస్ ఉద్యోగికి కోటి రూపాయల భీమా చెక్ అందజేత.

నల్గొండ, మన సాక్షి :

ఎస్ బి ఐ లో శాలరీ ప్యాకేజ్ ఉండి దురదృష్ట వశాత్తు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా వస్తుందని
ఎస్ బి ఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగి షేక్ తయ్యూబ్ 2026, ఫిబ్రవరి 13 న నల్గొండలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులు ముగించుకుని మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా చందనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారని తెలిపారు.

దివంగత షేక్ తయ్యుబ్ కు ఎస్ బి ఐ నకిరేకల్ శాఖలో పోలీస్ శాలరీ ప్యాకేజీ ఖాతా ఉందని,ఎస్బిఐలో శాలరీ ప్యాకేజీ ఖాతా కలిగి ఉన్న ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా క్లైమ్ చెల్లించడంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గార్డెన్ లో ఎస్ బి ఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో షేక్ తయ్యుబ్ తండ్రి షేక్ యూసుఫ్ ఆలీకి కోటి రూపాయల భీమా చెక్ అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ బి ఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది మాట్లాడుతూ పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా అందించిన కోటి రూపాయల బీమా ప్రయోజనం పోలీసు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో, ఆపద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడంలో ఎస్ బి ఐ కీలక పాత్ర పోసిస్తున్నదని అన్నారు. సమాజ రక్షణ కోసం నిరంతరం సేవలందించే పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు ఎస్ బి ఐ భీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం బాధిత కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియబ్రత మిశ్రా, రీజినల్ మేనేజర్ శ్రీ పద్మ బాబు, ఏజీఎం నితిన్ ఎం., చీఫ్ మేనేజర్ మధు బల్లా,తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు