నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు..!
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల య్యాయి.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటన నల్గొండ పట్టణంలోని పానగల్ రైల్వే బ్రిడ్జి పై మంగళవారం రాత్రి జరిగింది. కాగా పానగల్లు కు చెందిన కొత్తపల్లి శ్రీకాంత్ (41) తులస సాయి కృష్ణ బైక్ పై పానగల్ నుంచి నల్గొండ వైపు వస్తున్నారు. ఆ సమయంలో నల్గొండ వైపు నుంచి పానగల్ వైపు వెళ్తున్న కారు వారిని ఢీ కొట్టింది.
Also Read : TRS : టిఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన కవిత..!
ఈ ప్రమాదంలో కొత్తపల్లి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి కృష్ణకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీకాంత్ నల్గొండలోని ఫర్నిచర్ షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. టూ టౌన్ ఎస్ఐ సైదా బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









