Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్.. 23-10-2026

మన సాక్షి ఎప్పటికప్పుడు పాఠకులకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఈరోజు (శుక్రవారం) మీకోసం...

Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్.. 23-10-2026

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి ఎప్పటికప్పుడు పాఠకులకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ఈరోజు (శుక్రవారం) మీకోసం…

హైదరాబాద్‌లో స్వీట్ షాపులపై తనిఖీలు :

హైదరాబాద్ క్యూర్ పరిధిలో 12 బృందాలతో TG SAFE ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు.

అపరిశుభ్ర పరిసరాల్లో స్వీట్ల తయారీ, FSSAI లైసెన్స్ లేకుండా షాపుల నిర్వహణ, గడువు ముగిసిన స్వీట్ల విక్రయం గుర్తించారు. పురుగులు, ఫంగస్ ఉన్న పల్లీలు, స్వీట్లు కూడా అమ్మకానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని షాపుల మూసివేత, షోకాజ్‌, ఇంప్రూవ్‌మెంట్ నోటీసుల జారీ చేశారు.

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి :

అమెరికాలో ఖమ్మం యువతి గుండెపోటుతో మృతి చెందింది.
న్యూయార్క్‌లో ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగం వెతుకుతూ గుండెపోటుకు గురై నల్లమల అక్షిత మృతి చెందినది.
ఉన్నత చదువుల కోసం వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం :

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబయి వెళ్తున్న ఏఐ417 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఏటీసీకి సమాచారం అందించి, విమానాన్ని తిరిగి శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్. అనంతరం విమానాన్ని పరిశీలించిన సాంకేతిక బృందం

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి :

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయాలు అయ్యాయి. 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దెబ్బతిన్న పలు భవనాలు.. నిలిచిన విద్యుత్, టెలికమ్యూనికేషన్‌ సేవలు నిలిచిపోయాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐ10 కారును ఢీకొట్టిన ఫార్చ్యూనర్ :

మేడిపల్లి పీర్జాదిగూడ వద్ద మద్యం మత్తులో, లైసెన్స్ లేకుండా నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఫార్చ్యూనర్‌ ఐ10 కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్టీలు కొట్టిన కారులోని దంపతులకు తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు