Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి - నార్కట్పల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.

Miryalaguda : మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
మిర్యాలగూడ, మన సాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి – నార్కట్పల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఏడు కోట్ల తండా సమీపంలో అద్దంకి – నార్కట్పల్లి రహదారిపై నల్గొండ నుంచి మిర్యాలగూడ కు వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేశారు.










