Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : అకాల వర్షానికి నేల వాలిన వరి.. ఆదుకోవాలని డిమాండ్..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోత దశకు వచ్చినటువంటి పొలాలు నేల పాలు కావటం చాలా దురదృష్టకరమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు అన్నారు.

Miryalaguda : అకాల వర్షానికి నేల వాలిన వరి.. ఆదుకోవాలని డిమాండ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోత దశకు వచ్చినటువంటి పొలాలు నేల పాలు కావటం చాలా దురదృష్టకరమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు అన్నారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండిస్తే ఒకేసారి గాలి వాన రావడంతో వరి మొత్తం నేలపాలైనదని అన్నారు.

వారం పది రోజుల్లో వరి కోతల సమయంలో ఒకేసారి గాలి పిడుగులతో కూడిన వర్షం రావడంతోనే నిలువునా ఉన్న పొలాలు నేలమట్టమై రైతుల ఆశలను నీరుగార్చింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో మండలాల వారీగా నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని వారన్నారు. లేని పక్షంలో రైతులని సమీకరణ చేసి ప్రజా పోరాటాలు చేస్తామని అన్నారు.

ఈ పంట పొలాల పరిశీలనలో రైతులు గువ్వల రామలింగం, గువ్వల నగేష్, బంటు సతీష్, చిమట ఆంజనేయులు, మల్లెబోయిన మట్టయ్య, గువ్వల శీను, బంటు ధర్మయ్య, దుండియాల శీను, గువ్వల మహేష్, వెంకన్న, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు