Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Good News : బియ్యం ధరలు నిర్ణించిన ప్రభుత్వం.. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..!

నారాయణపేట జిల్లాలోని రైస్ మిల్లులు, హోల్‌సేల్/ రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలరాజు సూచించారు.

Good News : బియ్యం ధరలు నిర్ణించిన ప్రభుత్వం.. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..!

నారాయణపేట పట్టణం – రమాకాంత్,  మనసాక్షి :-

నారాయణపేట జిల్లాలోని రైస్ మిల్లులు, హోల్‌సేల్/ రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలరాజు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిపిటి, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకం బియ్యం కిలో రూ.74, హెచ్ఎం టి మరియు జె ఎస్ ఆర్ రకం బియ్యం కిలో రూ.79గా నిర్దేశించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారం జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు, జిల్లా మేనేజర్ సైదులు, తహసీల్దార్లు, కొలతల శాఖ అధికారులు, పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలోని పలు రైస్ మిల్లులు, హోల్‌సేల్/ రిటైల్ బియ్యం వ్యాపార దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బియ్యం విక్రయ ధరలను, తూకం మరియు కొలతలను పరిశీలించారు. జిల్లాలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, బియ్యం కొరత లేదని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి డేట్ ఫిక్స్..!

ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని, నిర్ణీత ధరలకు మించి విక్రయించకుండా సంబంధిత వ్యాపారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక బోర్డులను ప్రతి రైస్ మిల్లు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపార దుకాణాల్లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించడం, తూకం మరియు కొలతల్లో అక్రమాలకు పాల్పడటం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.

వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు సమయంలో నిర్దేశిత ధరలను తెలుసుకొని, అధిక ధరలు వసూలు చేసినా లేదా తూకంలో మోసాలకు పాల్పడినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు