అత్యంత దారుణం.. తల, మొండెం వేరయ్యే వరకు నరికి చంపిన కుటుంబ సభ్యులు..!
భూ వివాదంలో ఓ మహిళను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల పరిధిలో చోటు చేసుకుంది. తల్లి హత్యకు గురి కావడంతో ఇద్దరు పిల్లలు అనాదలయ్యారు.

అత్యంత దారుణం.. తల, మొండెం వేరయ్యే వరకు నరికి చంపిన కుటుంబ సభ్యులు..!
మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి :
భూ వివాదంలో ఓ మహిళను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల పరిధిలో చోటు చేసుకుంది. తల్లి హత్యకు గురి కావడంతో ఇద్దరు పిల్లలు అనాదలయ్యారు.
ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీత(26)కు, కోయిలకొండ మండలం చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాంతో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు రిషిక, శైలజ. భర్తకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఏడాది కిందట అతడి ఇద్దరన్నలు మణ్యనాయక్, పాండునాయక్ కలిసి హైదరాబాద్ కు తీసుకెళ్లారు.
Also Read : ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి అరెస్ట్..!
అంతకంటే ముందే పెద్ద మనుషుల ఒప్పందం మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర భూమిని సునీత పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. గొడవలతో ఏడాదిగా సునీత పుట్టింటికి వెళ్లింది. తిరిగి నెల రోజుల కిందట సునీత చింతల్ తండాకు వచ్చి ఇంట్లో ఉంటూ భూమి దగ్గరకు వెళ్తుంది. దీంతో భర్త తరపు కుటుంబ సభ్యులు భూమి వద్దకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారు.
సోమవారం ఇంటి దగ్గర ఉన్న సునీతపై దాడి చేసుకుంటూ మణ్యనాయక్ తన ఇంటి వరకు తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో సోదరుడు పాండునాయక్, అతడి భార్య పార్వతి, మరొకరు మానిక్యనాయక్ దాడి చేసి దారుణంగా నరకడంతో సునీత తల, మొండెం భాగాలు విడిపోయాయి.
అనంతరం అక్కడి నుంచి నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ గాంధీనాయక్ చెప్పారు. నిందితులను కోస్గిలో అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. తల్లి హత్యతో ఏడేళ్ల రిషిక, నాలుగేళ్ల శైలజ అనాథలయ్యారు.









