Breaking Newstravelజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు.. ఇవీ చార్జీలు..!
కార్తిక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నల్లగొండ డిపో నుండి పంచారామ క్షేత్రాలకు ప్రతి ఆదివారం సాయంత్రం స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు నల్లగొండ డిపో మేనేజర్ మేరీ లావణ్య తెలిపారు.

Nalgonda : కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు.. ఇవీ చార్జీలు..!
నల్లగొండ, మన సాక్షి :
కార్తిక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నల్లగొండ డిపో నుండి పంచారామ క్షేత్రాలకు ప్రతి ఆదివారం సాయంత్రం స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు నల్లగొండ డిపో మేనేజర్ మేరీ లావణ్య తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 7.00 గంటలకు బయలుదేరే ఈ బస్సుల ద్వారా భక్తులు సోమవారం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
బస్సులు బయలుదేరే తేదీలు : నవంబర్ 08, 15, 22, 29 మరియు డిసెంబర్ 06
టికెట్ ధరలు :
పెద్దలకు – రూ. 2000 /- మాత్రమే
పిల్లలకు – రూ. 1300 /- మాత్రమే
కావున భక్తులు, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ మేరీ లావణ్య కోరారు. 9063405696, 9959844918 ఈ నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.









